ఐదు అడుగులకు పైబడిన గణపతుల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలి
కాప్రా చెరువులో నిమజ్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసిన గణేష్ ఉత్సవ సమితి ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఐదు అడుగులకు పైబడిన గణపతి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి కల్పించాలని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కోరారు. ఈ మేరకు డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ తాడూరి గగన్...