అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: కేశెట్టి ప్రసాద్
ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 05, (తెలంగాణ దిశ) : అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న నిరసన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను చట్టసభలో ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత...