చలో అసెంబ్లీ నేపథ్యంలో గృహ నిర్బంధంలో కొల్లి మాధవి

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06, (తెలంగాణ దిశ) :  ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఇచ్చిన "చలో అసెంబ్లీ" పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజామున 4.50 నిమిషాలకు నిజాంపేట పూజిత ఎన్ క్లేవ్ లోని కొన్ని మాధవి నివాసానికి పోలీసులు చేరుకొని ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కొల్లి మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను...