అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) :  అయోధ్యలో అక్టోబర్ 4,5 తేదీల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) (ఎన్‌యూజే–ఐ) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంతో పాటు యూనియన్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎన్‌యూజే–ఐ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించేందుకు సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ...