చెరువా.. చెత్త కుండీనా..!?

నీరు గారి పోతున్న దమ్మాయిగూడ ‘నాసిన్ చెరువు’ చెత్తా చెదారంతో దుర్భరంగా మారుతున్న చెరువు..  అక్రమ కబ్జాలతో మరింత ప్రమాదంలో చెరువు ఉనికి దమ్మాయిగూడ, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : ఒకప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టి పరిసర ప్రాంతాల భూగర్భ జలాలను పెంపొందించిన దమ్మాయిగూడలోని నాసిన్ చెరువు నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతుంది. చెరువుతో పాటు పరిసరాలు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, వినియోగించిన వస్తువులతో నిండిపోవడంతో జలాశయం క్రమంగా చెత్త కుండీగా మారుతున్న దృశ్యం కనిపిస్తోంది. చెరువు చుట్టు పక్కల నివసించే...