రెడ్డి కాలనీ గణపతి లడ్డును రూ. 2.75 లక్షలకు దక్కించుకున్న ఐరెడ్డి రాజిరెడ్డి సునీత దంపతులు

చర్లపల్లి, సెప్టెంబర్ 23, (తెలంగాణ దిశ) : చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీ లడ్డూను రూ 2.75 లక్షలకు కాలనీకి చెందిన ఐరెడ్డి రాజిరెడ్డి సునీత దంపతులు దక్కించుకున్నారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాధునికి ప్రత్యేక పూజలు అనంతరం లడ్డును వేలం వేశారు. అనంతరం మేళ తాళాలు భాజా భజంత్రీలు, దేదీప్యమానమైన విద్యుత్ దీపాలతో అలంకరించిన గణనాధున్నీ నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భూమిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి, కోశాధికారి జీవన్ రెడ్డి, ఉపాధ్యక్షులు...