నేపాల్ విపత్తు బాధితులకు శ్రీరామానుజ సేవా ట్రస్టు అండ
రూ.10.55 లక్షల విరాళం సేకరణ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేత హెచ్ బి కాలనీ, సెప్టెంబర్ 04, (తెలంగాణ దిశ) : ప్రకృతి విలయంతో తీవ్ర భయానక విపత్తును ఎదుర్కొంటున్న నేపాల్ బాధితుల సహాయార్థం శ్రీరామానుజ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సహాయ కార్యక్రమానికి దాతలు మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు రూ.10,55,116/- విరాళంగా జమ అయినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా, డీఆర్‌డీఓ మాజీ...