మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

అమ్మ వారి రథోత్సవంలో పాల్గొన్న సుంకర నరేష్‌ అలంపూర్, అక్టోబర్ 16, (తెలంగాణ దిశ): గద్వాల జిల్లా అలంపూర్‌లో కొలువైన ప్రసిద్ధ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సుంకర నరేష్‌ శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూజలు సమర్పించి, లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయ మాడ వీధుల...