డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ వైఖరి ఏమిటి…?
రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర.. ప్రజా సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి ఏదీ...? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జవహర్నగర్ ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి: తోటకూర వజ్రేష్ యాదవ్ దమ్మాయిగూడ, అక్టోబర్ 29 (తెలంగాణ దిశ) : జవహర్నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించకుండా...