ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి తరలింపు..  మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం మేడ్చల్, నవంబర్ 19, (తెలంగాణ దిశ): మానవత్వం, సేవాభావాన్ని చాటుకుంటూ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచారు. మల్కాజిగిరిలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఆయనకు మౌలాలి పరిధిలోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్న వరంగల్‌కు చెందిన సురేష్ కనిపించారు. వెంటనే స్పందించిన మహేందర్ రెడ్డి తన...