పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి కానుకగా దుస్తుల పంపిణీ

కాప్రా, నవంబర్ 09, (తెలంగాణ దిశ) :  దీపావళి పండుగను పురస్కరించుకుని బోగారం, రాంపల్లి దాయరా, నాగారం డివిజన్ పరిధిలో గతంలో 10, 11, 12, 13 వార్డులుగా ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పురుష పారిశుద్ధ్య కార్మికులకు సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్ ప్యాంట్లు, షర్ట్లను పంపిణీ చేశారు. ప్రతి రోజూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత కోసం ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు....