యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలి : ఎంపీ ఈటల రాజేందర్

చర్లపల్లి, నవంబర్ 06, (తెలంగాణ దిశ):  చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సుమారు 2 వేల పరిశ్రమలు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వేత్తలు, దాతల సహకారంతో చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అధునాతన క్రీడా సముదాయంతో పాటు ఈఎస్ఐ డిస్పెన్సరీని రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి...