కీసరగుట్టలో వీఐపీలకే పెద్దపీట.. సామాన్య భక్తులకు తప్పని తిప్పలు..!

కార్తీక పౌర్ణమి వేళ దర్శనాల కోసం భక్తుల అవస్థలు..  ఏర్పాట్లపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి కీసర, (తెలంగాణ దిశ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వీఐపీలకు ప్రాధాన్యతతో దర్శనాలు సాగుతుండగా, మరోవైపు సామాన్య భక్తులు మాత్రం గంటల తరబడి...