మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి నెలవారీ పాస్ ధర భారీగా తగ్గింపు..

రూ. 8,500 నుంచి రూ.4,000కు తగ్గిం.పు హైదరాబాద్, నవంబర్ 06, (తెలంగాణ దిశ) :  నగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి నెలవారీ ప్రయాణ పాస్ ధరను భారీగా తగ్గించింది. ఇప్పటివరకు రూ.8,500గా ఉన్న నెలవారీ పాస్ ధరను రూ.4,000కు తగ్గించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర...