రోడ్డు భద్రతే లక్ష్యం.. ప్రమాదాల నివారణకు ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన

యంనంపేట్ ఎక్స్‌రోడ్డులో ‘సురక్షితంగా గమ్యం చేరండి’ కార్యక్రమం ఘట్‌కేసర్, నవంబర్ 24, (తెలంగాణ దిశ) : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ అధికారి ఆధ్వర్యంలో ఎస్‌ఐ, ట్రాఫిక్ సహాయ ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు, యువతకు...