ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఐక్యంగా ముందుకు సాగుతాం…!

రెండవ సారి కాప్రా సర్కిల్ సీసీఎస్ అధ్యక్షురాలిగా ఎంపల్లి పద్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కుషాయిగూడ, నవంబర్ 22, (తెలంగాణ దిశ) : కాలనీల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీ సంఘాల సమాఖ్య (సీసీఎస్) నిరంతరం కృషి చేస్తుందని రెండవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపల్లి పద్మారెడ్డి తెలిపారు. గత ఆరేళ్లుగా సీసీఎస్ ఆధ్వర్యంలో కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం కాప్రా సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీ...