Thursday, August 13, 2026
spot_img
Homeప్రత్యేకంమీ సేవా కేంద్రాల్లోనే నూతన పెన్షన్లకు దరఖాస్తులు

మీ సేవా కేంద్రాల్లోనే నూతన పెన్షన్లకు దరఖాస్తులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :  జిల్లాలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఈ-జిల్లా నిర్వాహకులు కె. శర్వణ్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పింఛన్‌కు అర్హత కలిగిన ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించి, సంబంధిత పత్రాలను అంతర్జాలంలో సమర్పించిన అనంతరం దరఖాస్తుదారులకు దరఖాస్తు గుర్తింపు సంఖ్య జారీ చేయబడుతుందని తెలిపారు. ఈ గుర్తింపు సంఖ్య ద్వారా భవిష్యత్తులో పింఛన్ దరఖాస్తు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అర్హత కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమీపంలోని మీ సేవా కేంద్రం ద్వారా నూతన పింఛన్ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఈ-జిల్లా నిర్వాహకులు కె. శర్వణ్ కుమార్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.