మీర్ పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన పి. నాగరాజుకు రూ.4 లక్షల ఎల్‌ఓసీ లెటర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం అందజేశారు. మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావులతో కలిసి ఎమ్మెల్యే ఈ సహాయాన్ని అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.




