దివంగత సరళా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
భద్రాచలం, ఆగస్టు 29, (తెలంగాణ దిశ) : భార్య మృతి పట్ల తీవ్ర విషాదంలో ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం టీవీ9 రిపోర్టర్ కర్ర అనిల్ రెడ్డిని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పరామర్శించారు. భద్రాచలంలోని అనిల్ రెడ్డి నివాసానికి శనివారం వెళ్లిన నాయకులు ఆయనను ఓదార్చి, దివంగత సరళా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సరళా రెడ్డి మృతి పట్ల మామిడి సోమయ్య తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అనిల్ రెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు చిర్రా శ్రీనివాస్ గౌడ్, ఎలుగోటి వెంకట్రావు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్, కోశాధికారి వేములకొండ రమేష్, ఉపాధ్యక్షుడు కందబోయిన నాగకృష్ణ, జి. గోపాలకృష్ణ, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి ఎం. గోపాల్,పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సుంక మహేష్, మణుగూరు నాయకులు పొదిల సుబ్బారావు, భద్రాచలం నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సరళా రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనిల్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో అండగా ఉంటామని తెలిపారు.




