Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణరోడ్డు భద్రతే లక్ష్యం.. ప్రమాదాల నివారణకు ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన

రోడ్డు భద్రతే లక్ష్యం.. ప్రమాదాల నివారణకు ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన

యంనంపేట్ ఎక్స్‌రోడ్డులో ‘సురక్షితంగా గమ్యం చేరండి’ కార్యక్రమం

ఘట్‌కేసర్, నవంబర్ 24, (తెలంగాణ దిశ) :

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ అధికారి ఆధ్వర్యంలో ఎస్‌ఐ, ట్రాఫిక్ సహాయ ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణాలు ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాస్తవంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనలను ఉదహరిస్తూ, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, బాధిత కుటుంబాలు జీవితాంతం తీవ్ర విషాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఒకరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని తెలియజేశారు. ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడాలని పోలీసులు పిలుపునిచ్చారు. మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా.. సురక్షితంగా ప్రయాణించండి.. క్షేమంగా గమ్యం చేరండి అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.