Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణమున్సిపల్ మహిళా సిబ్బందికి దసరా కానుకగా చీరల పంపిణీ

మున్సిపల్ మహిళా సిబ్బందికి దసరా కానుకగా చీరల పంపిణీ

నాగారం, అక్టోబర్ 21, (తెలంగాణ దిశ):

దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్, శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్, ఆయన సతీమణి అక్కల రూపా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా సిబ్బందికి చీరలను అందజేశారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, పరిసరాల పరిశుభ్రతతో పాటు వివిధ మున్సిపల్ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సిబ్బంది సేవలను గుర్తించి, వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పండుగ వేళ మహిళా సిబ్బందికి చీరలు అందజేయడం ద్వారా వారిలో ఆనందాన్ని నింపారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమించే సిబ్బందిని గౌరవించడం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.