Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణజిల్లాలో అన్ని డివిజన్ల కాంగ్రెస్, అనుబంధ సంస్థల క‌మిటీల‌ను నియమించాలి...

జిల్లాలో అన్ని డివిజన్ల కాంగ్రెస్, అనుబంధ సంస్థల క‌మిటీల‌ను నియమించాలి…

ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్

పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశంలో మేడ్చ‌ల్ జిల్లా నేత‌ల‌కు దిశా నిర్దేశం

మేడ్చ‌ల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 16, (తెలంగాణ దిశ) : జిల్లాలోని ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని డివిజన్లకు పార్టీతో పాటు అన్ని ర‌కాల అనుబంధ క‌మిటీల‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని ఏఐసీసీ ఇంచార్జీ నటరాజన్ మీనాక్షి సూచించారు. పూర్తి స్థాయిలో క‌మిటీల నిర్మాణంతోనే పార్టీని క్షేత్ర‌ స్థాయిలో మ‌రింత బ‌లోపేతం చేయవచ్చునని అన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జీలు, పీఏసీ స‌భ్యులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దిశగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఈ సంద‌ర్భంగా మీనాక్షి నటరాజన్ పార్టీ నేత‌ల‌కు సూచించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ అంశాలు, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో పీఏసీ కమిటీ సభ్యులు హరివర్ధన్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కాంటెస్టెంట్ ఎంపీ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ పార్టీ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ కొలన్ హన్మంత్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి, సేవాదళ్ అధ్యక్షులు షఫీయుద్దీన్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అజీజ్ బేగ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.