Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణతెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధనకు 27న మహా ధర్నా

తెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధనకు 27న మహా ధర్నా

వేలాదిగా తరలిరావాలని టిఎస్ యుటిఎఫ్ పిలుపు

వరంగల్, ఆగస్టు 26, (తెలంగాణ దిశ) :  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా కార్యదర్శి మేరుగు ప్రసన్న అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ప్రదర్శించిన ఐక్యత, త్యాగం, తెగువే ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన హక్కులు, సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా, ప్రభుత్వంతో చర్చలు జరిపినా, సమస్యలను పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు. జీవో 317తో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఐక్య పోరాట కార్యాచరణలో భాగంగా మొదటి దశలో పాఠశాల స్థాయిలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రెండవ దశలో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. మూడవ దశలో భాగంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రేపు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేరుగు ప్రసన్న హెచ్చరించారు. గురువారం నిర్వహించనున్న జిల్లా మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని టిఎస్ యుటిఎఫ్ నాయకులు అజ్మీరా రాజారాం, బిక్షపతి, రజియా సుల్తానా తదితరులు పిలుపు నిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.