Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణమహిళా కాంగ్రెస్ లో పదవుల కోసం 30లోగా సభ్యత్వాలు పూర్తి చేయాలి

మహిళా కాంగ్రెస్ లో పదవుల కోసం 30లోగా సభ్యత్వాలు పూర్తి చేయాలి

హైదరాబాద్, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  మహిళా కాంగ్రెస్ నూతన కమిటీలలో పదవుల కోసం ఈ నెల 30 లోగా సభ్యత్వాలు పూర్తి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సూచించారు. గత మూడు సంవత్సరాల నుంచి మహిళా కాంగ్రెస్ లో పని చేస్తున్న మహిళలకు సభ్యత్వం ఆధారంగానే పదవులు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, డివిజన్, మండల, బ్లాక్, మున్సిపల్ స్థాయిలలో నూతన కమిటీలను ఎంపిక చేయనున్నట్లు ఆమె తెలిపారు. వీటితోపాటు జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసిలలో డివిజన్లకు నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని స్థాయిలలో పదవులు ఆశించే వారు ఖచ్చితంగా సభ్యత్వ నమోదును ఈ నెల 30 వరకు పూర్తి చేయాలన్నారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబా, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జీ కమలాక్షిల ఆదేశాల మేరకు సభ్యత నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.