32 ఏళ్ల చరిత్రలో తొలిసారి వేలంలో కంపెనీల భాగస్వామ్యం..
మరింత ఉత్కంఠగా సాగిన వేలం
హైదరాబాద్, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) :
హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రూ.39 లక్షలకు వేలం పలికింది. సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ ధర రూ.4 లక్షలు పెరిగింది. బాలాపూర్ లడ్డూ వేలం 32 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యక్తిగతంగా నిర్వహించిన రిజిస్ట్రేషన్లతో వేలం జరుగుతుండగా, ఈసారి తొలిసారిగా కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కంపెనీల భాగస్వామ్యంతో వేలం మరింత ఉత్కంఠగా సాగింది. ఏటా బాలాపూర్ లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. లడ్డూను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడటంతో వేలం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలతో లడ్డూను దక్కించుకున్నారు.




