Friday, November 27, 2026
spot_img
Homeఆధ్యాత్మికంమూలా నక్షత్రం సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

అమ్మ వారి రథోత్సవంలో పాల్గొన్న సుంకర నరేష్‌

అలంపూర్, అక్టోబర్ 16, (తెలంగాణ దిశ):

గద్వాల జిల్లా అలంపూర్‌లో కొలువైన ప్రసిద్ధ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సుంకర నరేష్‌ శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూజలు సమర్పించి, లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయ మాడ వీధుల గుండా రథోత్సవాన్ని భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర నరేష్‌ ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తితో కలిసి అమ్మవారి రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగుతూ రథోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు, రథోత్సవంలో పాల్గొనడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. శ్రీ జోగులాంబ అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.