Sunday, October 11, 2026
spot_img
Homeతెలంగాణబ్యాంక్ సమ్మె నేపథ్యంలో ఆదివారం పని చేయనున్న బ్యాంకులు

బ్యాంక్ సమ్మె నేపథ్యంలో ఆదివారం పని చేయనున్న బ్యాంకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) :

ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బ్యాంక్ సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతితో దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు ఈ ఆదివారం తెరిచి ఉంటాయని ఎల్‌డీఎం సి. శివ ప్రసాద్ తెలిపారు. ఖాతాదారుల అత్యవసర బ్యాంకింగ్ అవసరాలు, నగదు లావాదేవీలు తదితర సేవలకు అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.