Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణ19న రాధికా చౌరస్తాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19న రాధికా చౌరస్తాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఏఎస్ రావునగర్, నవంబర్ 18, (తెలంగాణ దిశ) :

భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం (నవంబర్ 19)కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు రాధిక మూవీ ప్లెక్స్ సమీపంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ రావునగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేశెట్టి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.