Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి తరలింపు.. 

మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

మేడ్చల్, నవంబర్ 19, (తెలంగాణ దిశ):

మానవత్వం, సేవాభావాన్ని చాటుకుంటూ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచారు. మల్కాజిగిరిలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఆయనకు మౌలాలి పరిధిలోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్న వరంగల్‌కు చెందిన సురేష్ కనిపించారు. వెంటనే స్పందించిన మహేందర్ రెడ్డి తన వాహనాన్ని ఆపి, స్థానిక ట్రాఫిక్ పోలీసులతో పాటు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహకారంతో బాధితుడిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కూరగాయల వ్యాపారం చేసే సురేష్ మార్కెట్‌కు వెళ్తుండగా లారీ ఢీకొట్టిందని తెలిసింది. బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి వర్గాలకు సైతం ఫోన్ చేసి సురేష్ ఆరోగ్య పరిస్థితిని వివరించి, తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ సమయంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆయనకు తోడుగా నిలిచారు. ఆపద సమయంలో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనకు సహాయం చేసిన మహేందర్ రెడ్డికి బాధితుడు సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆయన తక్షణ స్పందన, సహాయక చర్యలను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.