Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణభాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్

కుషాయిగూడ, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) :  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్‌ను నియమించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్, కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి కలిసి చల్లా ప్రభాకర్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చల్లా ప్రభాకర్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అభినందనలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడంతో పాటు సమితి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చల్లా ప్రభాకర్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.