Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణజోగినపల్లి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు

జోగినపల్లి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు

హైదరాబాద్, ఆగస్టు 24, (తెలంగాణ దిశ) :  ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కర్మ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, శ్రీనివాసరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.