Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణన్యాయవాది సుంకర నరేష్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

న్యాయవాది సుంకర నరేష్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాన్ని ఢీకొన్న గేదె.. డివైడర్‌ను ఢీకొని ఆగిన కారు

ఖమ్మం, ఆగస్టు 24, (తెలంగాణ దిశ) :  ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త సుంకర నరేష్‌కు ఆదివారం రాత్రి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని కోర్టుకు వెళ్లి తిరిగి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళ్తుండగా, మలుపు సమీపంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదె నరేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న నరేష్‌తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం నరేష్ మరో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సుల వల్లే తాను ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నరేష్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.