Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణపోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026పై నాగారంలో వార్డు సభ

పోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026పై నాగారంలో వార్డు సభ

నాగారం, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  ఘట్‌ కేసర్‌ సర్కిల్‌ నాగారం డివిజన్‌ పరిధిలో పోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, ఓటర్ల వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల నమోదు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో తన పేరు సక్రమంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో బూత్‌ స్థాయి ఏజెంట్లు, వార్డు అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొని పోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.