Sunday, October 11, 2026
spot_img
Homeక్రైమ్సైబర్‌ నేరాలపై ఈసీఐఎల్‌ చౌరస్తాలో అవగాహన మానవహారం

సైబర్‌ నేరాలపై ఈసీఐఎల్‌ చౌరస్తాలో అవగాహన మానవహారం

కుషాయిగూడ, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) : సైబర్‌ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం ఈసీఐఎల్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, నకిలీ లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర అంశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లకు ఎలాంటి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్‌ వివరాలను తెలియజేయవద్దని, అనుమానాస్పద లింకులను తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సైబర్‌ నేరానికి గురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, సకాలంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ డీసీపీ నాగలక్ష్మి, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శివశంకర్‌, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, కుషాయిగూడ ఎస్సైలు వెంకన్న, సాయిలు, సతీష్‌, విజయ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సైబర్‌ నేరాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ సైబర్‌ భద్రతపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.