Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణరెడ్డి కాలనీ గణపతి లడ్డును రూ. 2.75 లక్షలకు దక్కించుకున్న ఐరెడ్డి రాజిరెడ్డి సునీత దంపతులు

రెడ్డి కాలనీ గణపతి లడ్డును రూ. 2.75 లక్షలకు దక్కించుకున్న ఐరెడ్డి రాజిరెడ్డి సునీత దంపతులు

చర్లపల్లి, సెప్టెంబర్ 23, (తెలంగాణ దిశ) :

చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీ లడ్డూను రూ 2.75 లక్షలకు కాలనీకి చెందిన ఐరెడ్డి రాజిరెడ్డి సునీత దంపతులు దక్కించుకున్నారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాధునికి ప్రత్యేక పూజలు అనంతరం లడ్డును వేలం వేశారు. అనంతరం మేళ తాళాలు భాజా భజంత్రీలు, దేదీప్యమానమైన విద్యుత్ దీపాలతో అలంకరించిన గణనాధున్నీ నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భూమిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి, కోశాధికారి జీవన్ రెడ్డి, ఉపాధ్యక్షులు బి. సుదర్శన్, సంయుక్త కార్యదర్శి హేల్మారెడ్డి, సలహాదారులు కె. సీతారామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రంగారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, బి. రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.