Sunday, October 11, 2026
spot_img
Homeతెలంగాణమహాత్మగాంధీ నోబెల్ పీస్ అవార్డుకు సుంకర నరేష్ ఎంపిక

మహాత్మగాంధీ నోబెల్ పీస్ అవార్డుకు సుంకర నరేష్ ఎంపిక

గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో పురస్కారం ప్రదానం

 

హైదరాబాద్, అక్టోబర్ 01, (తెలంగాణ దిశ) : 

ప్రజా నాయకుడు, న్యాయవాది సుంకర నరేష్ ప్రతిష్టాత్మకమైన మహాత్మగాంధీ నోబెల్ పీస్ అవార్డు- 2026కు ఎంపికయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించనున్న కార్యక్రమంలో నిర్వాహకులు ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘అత్యుత్తమ మానవతావాది’ అవార్డును అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే పలు అంశాలపై నాణానికి మరోవైపు ఉన్న వాస్తవాలను ప్రజలకు నిర్మొహమాటంగా తెలియజేస్తూ వారిలో చైతన్యం కల్పించడంలో సుంకర నరేష్ చేస్తున్న కృషిని జ్యూరీ గుర్తించింది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనవంతుగా స్పందిస్తూ పరిష్కార మార్గాలను సూచించడం, సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది. అలాగే ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగించడం వంటి అంశాలు కూడా అవార్డు ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన సుంకర నరేష్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.