హైదరాబాద్, ఆగస్టు 15, (తెలంగాణ దిశ) : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ జెన్ కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీప్ దేవనబోయిన ప్రతాప్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతాకం అందుకోవడం గర్వంగా, మరపురాని అనుభూతిగా ఉందని తెలిపారు. సేవా ప్రయాణంలో ఈ గౌరవం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. తన విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర పోలీసు సిబ్బంది, మిత్రులు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి సహకారం, ఆశీస్సుల వల్లే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం సాధ్యమైందని అన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవలో మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకం అందుకోవడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు.




