Monday, October 12, 2026
spot_img
Homeఆధ్యాత్మికంనకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి

నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి

తిరుపతి, ఆగస్టు 14, (తెలంగాణ దిశ) : తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌ సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌ సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్‌ మార్క్‌లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గత రెండేళ్లలో 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్ సైట్ లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. టీటీడీ పేరు, లోగో, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్‌ మార్క్, సైబర్ చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.