Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఈసీఐఎల్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

ఈసీఐఎల్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ… టాడీ కార్పొరేషన్ ద్వారా గౌడ యువతకు సబ్సిడీ రుణాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు పెద్దాపురం కుమారస్వామి రజక మాట్లాడుతూ సామాజిక న్యాయంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, సంఘం నాయకులు తాళ్ల వెంకటేష్ గౌడ్, మిట్టపల్లి విజయ్ కుమార్ గౌడ్, కాసుల పోచయ్య గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, బుడంపల్లి రఘుపతి గౌడ్, రామకృష్ణ, సందీప్ గౌడ్, కనకరాజ్ గౌడ్, రంజిత్ గౌడ్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.