Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : మేడ్చల్ మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రతినిధులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్ లతో పాటు పంజాల శ్రీనివాస్ గౌడ్, బుడంపల్లి రఘుపతి గౌడ్, రామకృష్ణ, నూనెముంతల రంజిత్ గౌడ్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.