అందరి సహకారంతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా : నూతన కన్వీనర్ గగన్ కుమార్
ఏఎస్ రావునగర్, ఆగస్టు 30, (తెలంగాణ దిశ) : 2026 సంవత్సర గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్‌గా జమ్మిగడ్డకు చెందిన తాడూరి గగన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు, పలువురు ప్రముఖులు, ఉత్సవ సమితి సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయంతో గగన్ కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఫౌండర్లు పుల్లారెడ్డి, కె. రమేష్ యాదవ్, మర్రి మోహన్ రెడ్డి, వెంకట హరి గుప్తా, మల్కా రమాదేవి, బొజ్జ రాఘవరెడ్డి తదితరులు నూతన కన్వీనర్ గగన్ కుమార్‌కు ఆశీస్సులు అందజేశారు. అదే విధంగా మాజీ కన్వీనర్లు కిషోర్ చారి, నీరుకొండ సతీష్ బాబుతో పాటు రామస్వామి ప్రభాకర్ రెడ్డి, తేలు నాగరాజు, పృథ్వి, కాసం మహిపాల్ రెడ్డి, నితిన్ తదితరుల సహకారంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు. ప్రస్తుత మిత్రబృందం కుమారస్వామి, ఉమేష్ చారి, ఆదినారాయణ చౌదరి, పాత కోటి రామలింగం, సింగం కిరణ్, సత్యనారాయణ గౌడ్, పెద్ది నవీన్ గుప్తా, మురళి, సతీష్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గగన్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యత అప్పగించిన ఉత్సవ సమితి పెద్దలకు, మాజీ ఫౌండర్ల, మాజీ కన్వీనర్ల, సభ్యులు, మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్ రావునగర్ డివిజన్‌లో 2026 గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఐకమత్యానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు సాగుతానని గగన్ కుమార్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో స్థానిక ప్రజలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.




