Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 10న ‘చలో హైదరాబాద్’

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 10న ‘చలో హైదరాబాద్’

పోస్టర్‌ ఆవిష్కరించిన టీజీఈజేఏసీ నేతలు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 05, (తెలంగాణ దిశ) :  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్‌ రవి ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి వినోద్, అదనపు ప్రధాన కార్యదర్శి వై. రామేశ్వర్‌గౌడ్, కో-చైర్మన్‌ బి. వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్లు ఆనంద్‌రెడ్డి, విఠల్‌, మదన్‌రెడ్డి, రాజు, పీఆర్‌టీయూటీఎస్‌ ప్రధాన కార్యదర్శి చ. ఆనంద్‌రెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి విఠల్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా టీఎన్‌జీవోస్‌ కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు కార్తీక్‌ ఆధ్వర్యంలో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆనంద కార్యాలయంలోనూ ‘చలో హైదరాబాద్‌’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంఘటితంగా మద్దతు తెలిపి, సెప్టెంబర్‌ 10న జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్‌ నాయకులు భరత్‌కుమార్‌, శేష సాయి గిరికాంత్‌, కె. అశ్విని, ఎల్‌. అక్షయ్‌కుమార్‌తో పాటు నాగరాజ్‌, అబ్రహాం, ఉమాకాంత్‌, కిషోర్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.