ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 05, (తెలంగాణ దిశ) : అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న నిరసన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను చట్టసభలో ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన నాయకులు అసెంబ్లీకి దూరంగా ఉండటంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు నిర్వహిస్తున్న నిరసన సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో జరిగే నిరసన సభను విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు పలకాలని కేశెట్టి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: కేశెట్టి ప్రసాద్




