Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణచాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

కుషాయిగూడ, సెప్టెంబర్ 10 (తెలంగాణ దిశ) : తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాటి రజాకారులు, భూస్వాముల దోపిడీకి ఎదురొడ్డి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరంతో పాటు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, పార్టీ సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, రజక సంఘం నాయకులు శనిగరం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.