Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఅమ్మనబోలులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

అమ్మనబోలులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

భువనగిరి, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) :  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని అమ్మనబోలు గ్రామంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గౌడ సంఘం పెద్దలు, గౌడ యువజన సంఘం నాయకులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం, ధైర్య సాహసాలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జయంతి వేడుకల్లో పాల్గొనడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.