Sunday, October 11, 2026
spot_img
Homeఆధ్యాత్మికంజమ్మిగడ్డలో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు

జమ్మిగడ్డలో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు

ఏఎస్ రావునగర్, ఆగస్టు 16, తెలంగాణ దిశ) : ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ భగత్‌నగర్ కాలనీలో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. పడాల ఆనంద్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఫలహారం బండిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేయగా, భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఊరేగింపు మార్గంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడంలో ఇటువంటి సామూహిక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు సోదరభావాన్ని చాటిచెబుతాయని పేర్కొన్నారు. కాలనీ ప్రజలు ఐకమత్యంతో నిర్వహించిన ఈ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కేశెట్టి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.