Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణపద్మశాలి టౌన్‌షిప్ అభివృద్ధికి బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలి

పద్మశాలి టౌన్‌షిప్ అభివృద్ధికి బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలి

ఏఎస్‌ రావునగర్, ఆగస్టు 22, (తెలంగాణ దిశ) : కాప్రా పద్మశాలి టౌన్‌షిప్‌లోని ప్రతి ప్లాట్‌ యజమాని కాలనీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని భావనాఋషి కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు సీత అంజనేయులు కోరారు. శనివారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షుడు అతినగరం సుదేశ్‌, కార్యవర్గ సభ్యులు గుర్రం విశ్వేశ్వరరావు, కర్నాటి నాగభూషణంతో కలిసి ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం సొసైటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఇప్పటికే సుమారు 1,800 మంది సభ్యులు చెల్లించిన బెటర్‌మెంట్‌ చార్జీలతో పూర్తి చేసినట్లు తెలిపారు. కాలనీలో ఇంకా చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు నిధులు అవసరమని, అందువల్ల మిగిలిన సభ్యులు కూడా బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని కోరారు. సెప్టెంబర్‌ 20లోపు చార్జీలు చెల్లించే సభ్యులకు రాయితీ కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించని సభ్యులపై సొసైటీ బైలాస్‌ ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీత అంజనేయులు హెచ్చరించారు. అవసరమైతే సెల్‌ డీడ్‌ రద్దు కోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అలాగే సొసైటీ ఎన్‌ఓసీ లేకుండా పద్మశాలి టౌన్‌షిప్‌లో ప్లాట్ల కొనుగోలు, విక్రయాలు చేపట్టవద్దని సూచించారు. సొసైటీ ఎన్‌ఓసీ లేకుండా జరిగే లావాదేవీలపై కాప్రా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎంఎంసీ కాప్రా సర్కిల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రతి సభ్యుడు బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించి కాలనీ అభివృద్ధికి సహకరించాలని సొసైటీ అధ్యక్షుడు సీత అంజనేయులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.