Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చలు

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చలు

ఉప్పల్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ శుక్రవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలు తీరు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధిక గుప్తాతో ప్రభాకర్ సమావేశమై నియోజకవర్గంలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ఇప్పటికే మంజూరై వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.