Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణజెన్–జీ యువత ఆలోచనలకు వేదిక.. తీన్మార్ మల్లన్నతో ముఖాముఖి

జెన్–జీ యువత ఆలోచనలకు వేదిక.. తీన్మార్ మల్లన్నతో ముఖాముఖి

ఏఎస్ రావునగర్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : “మీ గొంతు–మా లక్ష్యం” అనే నినాదంతో జెన్–జీ యువత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలోని రౌండ్ బిల్డింగ్ టీజీఐఐసీ కాలనీ గ్రౌండ్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో యువతీ యువకులు నేరుగా ముఖాముఖి సంభాషించే అవకాశం కల్పించనున్నారు. యువత ఆలోచనలు, ఆశయాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలపై విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు తమ సమస్యలు, సూచనలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ఈ సమావేశం ఒక మంచి వేదికగా నిలవనుంది. యువత భవిష్యత్‌కు సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. యువతీ యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువ మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.