Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణమల్కాజిగిరి యువతి శ్రేయ లక్కప్రగడకు హార్వర్డ్ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌ షిప్‌

మల్కాజిగిరి యువతి శ్రేయ లక్కప్రగడకు హార్వర్డ్ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌ షిప్‌

మల్కాజిగిరి, ఆగస్టు 24, (తెలంగాణ దిశ) :  మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల యువతి శ్రేయ లక్కప్రగడ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వ విద్యాలయ స్కాలర్‌ షిప్‌కు ఎంపికయ్యారు. 2026–27 విద్యా సంవత్సరానికి అందించే ‘లూయిస్ అండ్ ఐడా టాటెల్‌మన్ స్కాలర్‌ షిప్’ ఆమెను వరించింది. వ్యక్తిగత, విద్యా జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, అసాధారణ పట్టుదల, స్థైర్యాన్ని ప్రదర్శించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. ఈ నేపథ్యంలో శ్రేయ ప్రతిభను గుర్తించి ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం లభించింది. హైదరాబాద్‌లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తున్నప్పటి నుంచే శ్రేయ ‘డెక్స్టెరిటీ గ్లోబల్’ ఆధ్వర్యంలోని నేషనల్ స్కాలర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందారు. అనంతరం డెక్స్టెరిటీ స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (డెక్స్ స్కూల్)లోనూ శిక్షణ పూర్తి చేశారు. ప్రస్తుతం పీజీ విద్యను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. టాటెల్‌ మన్ స్కాలర్‌ షిప్ ద్వారా 40 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38 లక్షలు) పొందుతున్న ఏకైక యువతిగా శ్రేయ నిలిచారు. అంతకుముందు 2022లో హైస్కూల్ విద్యార్థినిగా ఉన్న సమయంలోనే అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.2.7 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ పొందడం విశేషం. శ్రేయ లక్కప్రగడ సాధించిన ఈ ఘనత మల్కాజిగిరి ప్రాంతానికే కాకుండా తెలంగాణ యువతకు గర్వకారణంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.